నవతెలంగాణ-కమ్మర్ పల్లి
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు కమ్మర్‌పల్లి ఎస్ఐ సిహెచ్ సతీష్ ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం మండల కేంద్రంలోని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ హసకొత్తూర్ ఎక్స్ రోడ్ వద్ద అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సతీష్ మాట్లాడుతూ ప్రజలకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఇంట్లోని వ్యక్తులు ఎవరైనా మాదకద్రవ్యాలకు అలవాటు పడితే ఆ కుటుంబమే చిన్నాభిన్నం అవుతుందన్నారు. కార్యక్రమంలో ప్రజలు, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



