నవతెలంగాణ – నాచారం
ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మాత జయంతి సందర్భంగా నాచారం ప్రాంతంలో వాసవి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. శ్రీ ఆర్యవైశ్య సంఘం నాచారం కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సాయిబాబా దేవాలయంలో వాసవి మాతకు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమార్చనతో పాటు వాసవి మాత పారాయణం చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, వాసవి మాత జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించి నిర్వహించడం ఆనందకరమని తెలిపారు.
ఆర్యవైశ్యుల కులదేవతగా వాసవి మాతకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. వ్యాపార రంగంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఆర్యవైశ్యులు చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఇన్నేళ్లుగా ఎదురుచూస్తున్న వాసవి మాత జయంతిని ఈ సంవత్సరం ప్రభుత్వ పరంగా నిర్వహించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాచారం ఆర్యవైశ్య సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం నాచారం కమిటీ అధ్యక్షుడు శ్రీరామ్ సత్యనారాయణ (బండల), గౌరవ అధ్యక్షుడు సింగిరికొండ నరసింహ, జనరల్ సెక్రటరీ బొగ్గారపు రమేష్, కోశాధికారి ఏగిన భాస్కర్, జాయింట్ సెక్రటరీ మహేశ్వర మూర్తి, అడిషనల్ జాయింట్ సెక్రటరీ ఎలిషాల లింగం, ఉపాధ్యక్షులు గౌరీశెట్టి నరేందర్, పుల్లూరి లక్ష్మణ్, సలహాదారులు మరియు సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.



