నవతెలంగాణ-బీర్కూర్ (నసురుల్లాబాద్)
గోనె సంచుల కొరత కారణంగా రైతులు ధాన్యం కొనుగోలు సొసైటీల ఎదుట రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం బీర్కూరు మండల కేంద్రంలో నెల రోజుల క్రితం నుంచి పంట కోతలు పూర్తయినా, సంచులు అందకపోవడంతో కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం వర్షాలకు తడిసిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ సుమారు వందల సంఖ్యలో రైతులు సొసైటీకి చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తూ,కారదర్శికి నిలదీశారు.
కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరకు ధాన్యాన్ని కొంటామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీంతో యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కొన్నాళ్లుగా నెలకొన్న అయోమయం నుంచి రైతులు ఊపిరిపీల్చుకున్నారు. అధికార యంత్రాంగం అంతా హడావిడిగా ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు. మండలంలో గత రెండు వారాలుగా ధాన్యం కొనుగోలు చేస్తున్న రైతులకు సరి పడు గోనె సంచులను సమకూర్చడంలో సొసైటీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు తెలిపారు. ధాన్యం కొనుగోలుపై దృష్టి సారించడంతో గన్నీ బ్యాగుల(గోనె సంచులు) కొరత నెలకొన్నది. బాన్సువాడ నియోజకవర్గంలో బీర్కూర్ నసురుల్లాబాద్ మండలాల్లో ముందస్తు పంటలు సాగు చేయడంతో నియోజవర్గంలో ముందస్తుగానే వరి కోతలు వస్తాయి. వరి కోతల ప్రారంభమై నెల రోజులు అవుతున్న రైతులకు సరిపడు గోనెసంచులు సమకూర్చడంలో అధికారులు విఫలం చెందారని రైతులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇప్పటికైనా రైతులకు సరిపడే గోల సంచులు సమకూర్చాలని రైతులు కోరుతున్నారు.
బీర్కూర్ లో గోనె సంచుల కోసం ఆందోళన
- Advertisement -
- Advertisement -



