Sunday, April 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగరంగ వైభవంగా వాసవి మాత ఆలయ నిర్మాణ భూమిపూజ

అంగరంగ వైభవంగా వాసవి మాత ఆలయ నిర్మాణ భూమిపూజ

- Advertisement -

నవతెలంగాణ-తుంగతుర్తి
ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవి మాత జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం సంతోషకరమని,అమ్మవారి ఆశీస్సులతో సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఆర్యవైశ్యులు ఎల్లప్పుడు ముందుంటారని సదాచార్ ట్రస్ట్ చైర్మన్,వాసవి మాత ట్రస్ట్ సభ్యులు ఈగ దయాకర్ గుప్తా అన్నారు. ఆదివారం తుంగతుర్తి పట్టణ కేంద్రంలో వాసవి మాత ఆలయం సమేత నగేశ్వర స్వామి,విగ్నేశ్వరుడు ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఈ మేరకు వేద పండితులు మొదట నగేశ్వర స్వామి పూజ,అనంతరం వాసవి మాత భూమి పూజ కార్యక్రమాన్ని తుంగతుర్తి మండల ఆర్యవైశ్య సంఘం సభ్యుల ఆధ్వర్యంలో, ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాసవి మాత ఆలయ నిర్మాణంలో రాష్ట్ర, జిల్లా,మండల,నియోజకవర్గ ఆర్యవైశ్యులు ప్రత్యేకంగా ఆర్థిక సహకారం అందించాలని కోరారు.ఇప్పటి వరకు ఆలయ నిర్మాణంలో ఆర్థిక సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.ఆలయ నిర్మాణం అయేంతవరకు ప్రతి ఒక్కరు ఐకమత్యంతో పని చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఈగ నాగన్న,సీనియర్ ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఓరుగంటి అంతయ్య,తాటికొండ సీతయ్య,పోలవరపు సంతోష్,బండారు దయాకర్,ఈగ లక్ష్మయ్య, చెర్విరాల మల్లయ్య,బుద్ద వీరన్న,మాశెట్టి వెంకన్న, గోపారపు సత్యనారాయణ,బండారు నాగన్న, ఓరుగంటి సుభాష్,ఓరుగంటి శ్రీనివాస్,తాళ్లపెళ్లి సత్యనారాయణ,వివిధ మండలాల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -