Sunday, April 26, 2026
E-PAPER
Homeకరీంనగర్ఉపాధ్యాయులకు పదోన్నతులతో బదిలీలు చేపట్టాలి

ఉపాధ్యాయులకు పదోన్నతులతో బదిలీలు చేపట్టాలి

- Advertisement -
  • టిఆర్టిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్ డిమాండ్
  • నవతెలంగాణ – రాయికల్
  • రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్ డిమాండ్ చేశారు. ఆదివారం రాయికల్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులతో కూడిన బదిలీల ప్రక్రియను జనాభా లెక్కల అనంతరం జూలై నెలలో ఎటువంటి జాప్యం లేకుండా చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
  • అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం ద్వారా విద్యా వ్యవస్థలో మరింత ఉత్సాహం పెరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాథమిక పాఠశాలకు తప్పనిసరిగా ఒక ప్రధానోపాధ్యాయుడి పోస్టు మంజూరు చేయాలని, దీంతో పరిపాలనలో ఉన్న ఇబ్బందులు తొలగి విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. ప్రాథమిక స్థాయి నుంచే బలమైన నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు. అలాగే పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, పెన్షనర్ ఉపాధ్యాయులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి పీఆర్‌సీ అమలు చేయాలని కోరారు. మే 5న నిర్వహించే జిల్లా కేంద్ర నిరాహార దీక్షలో ఉపాధ్యాయులు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం టీఆర్‌టీఎఫ్ ఎల్లప్పుడూ ముందుంటుందని, ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు తుంగూరి సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బొల్లె చిన్నయ్య, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బేతి సాయి కృష్ణ, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి అంగడి రవీందర్, రాష్ట్ర కన్వీనర్ ముక్కెర శేఖర్, నాయకులు రాజ్ కిశోర్, రమేష్, సత్యనారాయణ, నాగభూషణం, సురేష్, మధు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -