Sunday, April 26, 2026
E-PAPER
Homeఖమ్మంమండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జారె 

మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జారె 

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన శుభకార్యాలలో స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు. పాతనారంవారిగూడెం లో జరిగిన శ్రీ సీతారామచంద్రస్వామి వారి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభం, శిఖరం, గ్రామదేవత ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండువారిగూడెం లో మడివి ధర్మారావు – కనక దంపతుల కుమార్తె పూజ శ్రీ నూతన వస్త్రాలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. గుమ్మడవల్లి లో నక్కనబోయిన,బత్తుల వారి వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -