ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-నసురుల్లాబాద్
పేదప్రజలు అనారోగ్యానికి గురి అయితే ఆపద సమయంలో సీఎం సహాయనిధి పేదలకు వరం లాంటిదని రాష్ట్ర వ్యవసాయ ప్రభుత్వం సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం బాన్సువాడ పట్టణంలో బీర్కూర్, నసరుల్లాబాద్ లబ్దిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. బీర్కూర్ మండలం నలుగురు సీఎం సహాయ నిధి లబ్ధిదారులకు రూ 75 వేలు, అలాగే నసురుల్లబాద్ మండలం 8 మంది సీఎం సహాయ నిధి లబ్దిదారులకు రూ 1,లక్ష 59వేల రూపాయల చెక్కులను బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అగ్రోస్ ఛైర్మన్ శ్రీ కాసుల బాలరాజు ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహార్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. పేదప్రజలను ఆదుకునేందుకే ముఖ్యమంత్రి సహాయనిధి ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ మండల నాయకులు నసురుల్లాబాద్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సీఎం సహాయ నిధి పేదలకు వరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



