Sunday, April 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోతారంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం 

పోతారంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం 

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి 
పాల్వంచ మండలంలోని పోతారం గ్రామంలో ఆదివారం పాల్వంచ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లె రమేష్ గౌడ్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ ఎప్పుడూ అంకిత భావంతోనే పనిచేస్తుందన్నారు.  రైతులకు కనీస మద్దతు ధరను అందిస్తూ వారి ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గ్రామస్థుల ప్రశంసలు అందుకుంటున్నాయన్నారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. “రైతు బాగుంటే దేశం బాగుంటుంది” అనే ధ్యేయంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజకు సరైన ధర లభించేలా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయడం రైతులకు మరింత భరోసా కలిగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గ్యార (చిన్న )సాయిలు  ఉప సర్పంచ్, అలాగే వివిధ గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -