Sunday, April 26, 2026
E-PAPER
Homeక్రైమ్వడదెబ్బతో వ్యక్తి మృతి

వడదెబ్బతో వ్యక్తి మృతి

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
ఎండ తీవ్రత తాళలేక వడదెబ్బతో ఒక వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన పరకాల పట్టణంలోని చోటుచేసుకుంది. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు, పాలిటెక్నిక్ కాలేజీ వెనుక గల శాంతినగర్‌కు చెందిన కోకిల తిరుపతి (43) వృత్తిరీత్యా ఉప్పర పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజువారి పనిలో భాగంగా గత శుక్రవారం కూలీ పనికి వెళ్లిన తిరుపతి, తీవ్రమైన ఎండల కారణంగా అస్వస్థతకు గురయ్యాడు. ఆ రాత్రి ఇంటికి వచ్చి నిద్రపోయిన తిరుపతి, మరుసటి రోజు ఉదయం ఎంతటికీ లేవకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే పరకాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తిరుపతి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ తెలిపారు. మృతునికి భార్య స్వప్న, ఒక కుమార్తె ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం రోదనలు మిన్నంటాయి. అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన తిరుపతి మృతితో ఆ కుటుంబం వీధిన పడిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -