Sunday, April 26, 2026
E-PAPER
Homeకరీంనగర్స్వీయ గణన ప్రక్రియను విజయవంతం చేయాలి

స్వీయ గణన ప్రక్రియను విజయవంతం చేయాలి

- Advertisement -

జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ అండ్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరిమ అగ్రవాల్
సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న జిల్లా కలెక్టర్
నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల

జన గణన 2027 లో భాగంగా స్వీయ గణన ప్రక్రియను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ అండ్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు. జన గణన 2027 లో భాగంగా ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 10 వ తేదీ వరకు నిర్వహించనున్న స్వీయ గణన  ప్రక్రియను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఆదివారం జిల్లా కలెక్టర్ స్వీయ గణన చేసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ అండ్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. https://se.census.gov.in వెబ్ సైట్ ద్వారా లాగిన్ కావాలని సూచించారు. ఈ మొత్తం ప్రక్రియకు కేవలం 5 నిమిషాల సమయం పడుతుందని, వెబ్ సైట్ పూర్తి స్థాయిలో సురక్షితమని స్పష్టం చేశారు.

ప్రజల సమాచారం పూర్తి భద్రంగా ఉంటుందని వెల్లడించారు. ఇంటింటికి వచ్చే ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు గుర్తింపు కార్డులు, ఇతర వివరాలు ఇచ్చామని తెలిపారు. జిల్లాలోని ప్రజలు సర్వే కోసం వచ్చే వారికి 34 ప్రశ్నలకు సరైన సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. స్వీయ గణన లో భాగంగా ప్రజలు ఇచ్చే సమాచారంతో ప్రభుత్వ పథకాలకు అర్హత సాధించడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు.ఈ నెల 26 వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ  వరకు స్వీయ గణన  జిల్లాలో నిర్వహించనున్నామని తెలిపారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది జిల్లాలోని ప్రజాప్రతినిధులు స్వీయ గణన చేసుకోవాలని పేర్కొన్నారు.


సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, ఇతర ప్రభుత్వ/ ప్రైవేట్ ఉద్యోగులు వారి మొబైల్ ఫోన్ల ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. జనాభా గణన సంబంధించి 1025 మంది ఎన్యూమరేటర్లు, 173 మంది సూపర్ వైజర్లకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి జన గణన అని, డిజిటల్ విధానంలో చేయనున్నారని వెల్లడించారు. ఇప్పటి వరకు 1117 హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ గుర్తించామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఓ శ్రీనివాసాచారి, ఈడీఎం శ్రీనివాస్, ఎస్ ఓ సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -