రైతు వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టడంలో ఏఐకేఎస్ కీలకం
బీజేపీ అధికారంలోకి వచ్చిన పదేండ్లలో
10 లక్షల మంది ఆత్మహత్య సహజ పోరాట యోధుడు ఏలూరి లక్ష్మీనారాయణ
‘ఎర్రజెండా ముద్దుబిడ్డ ఏలూరి’ పుస్తకావిష్కరణ సభలో సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు విజ్జు కృష్ణన్
మతోన్మాదంతో ప్రమాదం : తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకరణ ఆర్థిక విధానాలు దేశానికి ముప్పుగా పరిణమించాయని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు విజ్జు కృష్ణన్ అన్నారు. ఈ విధానాల కారణంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన పదేండ్లలో 10 లక్షల మంది ఆత్మహ త్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సరళీకరణ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించటంలో ఏఐకేఎస్ కీలకంగా వ్యవహరించిందని చెప్పారు. మార్క్సిస్టు యోధుడు ఏలూరి లక్ష్మీనారాయణ 34వ వర్ధంతి సందర్భంగా ఆదివారం స్థానిక సుందరయ్య భవనంలో సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ‘ఎర్రజెండా ముద్దుబిడ్డ ఏలూరి’ పుస్తకావిష్కరణ సభలో విజ్జు కృష్ణన్, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజ్జు కృష్ణన్ మాట్లాడుతూ.. మోడీ పాలనలో ఆదివాసీలు, దళితులపై దాడులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో రైతుల దుస్థితి గురించి చెబుతూ.. నాసిక్ నుంచి ముంబయి వరకు సాగిన యాత్ర ఘటనలను వివరించారు. 1930 నాటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని, నాటి ఫాసిజానికి వ్యతిరేకంగా సోవియట్ యూనియన్ నిలిచిందన్నారు. అదే సమయంలో ఏలూరి లక్ష్మీనారాయణ వంటి కవ¶్యనిస్టు యోధులు ఉద్యమ అరంగేట్రం చేశారని తెలిపారు. రాయల్ సోల్జర్లా వ్యవహరించి నియంత పోకడలను తిప్పికొట్టగలిగారని చెప్పారు. నేటి నాయకత్వం నాటి నాయకత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ‘ఎక్కడ కూర్చున్న వారు అక్కడే కూర్చుంటే మీ కాళ్లకు ఉన్న సంకెళ్ల గురించి తెలియదు.. మీరు ఎప్పుడైతే కదులుతారో అప్పుడే ఆ సంకెళ్ల గురించి తెలుస్తుంది’ అని, అలా నిరంతరం కదిలి పోరాట స్ఫూర్తిని రగిలించిన వ్యక్తి ఏలూరి లక్ష్మీనారాయణ అని విజ్జుకృష్ణన్ చెప్పారు. ఏలూరి తండ్రి అనంతరామయ్య స్వాతంత్య్ర సమరయోధు లని, తండ్రే ఆయనకు స్ఫూర్తి అయి ఉండొచ్చని అన్నారు. బండారు చందర్ రావు, బత్తుల భీష్మారావు వంటి వారితో కలిసి ‘ఏలూరి’ ఉద్యమాన్ని ముందుకు నడిపారని చెప్పారు. ఏలూరి సతీమణి జయమ్మ నిర్వహించిన పాత్ర చెప్పుకోదగినదన్నారు.
మోడీ ఆర్థిక విధానాలు – మతోన్మాదంతో ప్రమాదం : తమ్మినేని
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు – మతోన్మాదం దేశానికి తీవ్ర ప్రమాదం అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. మోడీ బానిసత్వం వల్ల ప్రపంచానికి నాయకత్వం వహించే అవకాశాన్ని ఇండియా కోల్పోతుందని చెప్పారు. ప్రజల్లో ఉన్నాడా? లేదా? అనేదే కవ¶్యనిస్టుకి ప్రామాణికమని, అలా ప్రజల్లో ఉండి పోరాడిన యోధుడు ఏలూరి లక్ష్మీనారాయణ అని చెప్పారు. కమ్యూనిస్టు ఉద్యమానికి ఆటుపోట్లు ఎప్పుడూ ఉంటాయని, కష్టాలు వచ్చినప్పుడు నిలబడిన వాడే నిజమైన కవ¶్యనిస్టన్నారు. అమెరికా దెబ్బతిన్నాక డాలర్ దెబ్బతినక తప్పదని, ప్రపంచం కమ్యూనిజం వైపు చూడటం తథ్యమన్నారు. సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే రీతిలో మోడీ లేరని విమర్శించారు. ఏలూరి లక్ష్మీనారాయణ స్ఫూర్తితో ముందుకు సాగాలని చెప్పారు.
ఉత్తమ కవ¶్యనిస్టు
లక్షణాలన్నీ ఏలూరిలో… : పోతినేని
ఉత్తమ కమ్యూనిస్టు లక్షణాలన్నీ ఏలూరి లక్ష్మీనారాయణలో ఉన్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. ఏలూరి జీవితాంతం వర్గ పోరాటాలే నిర్వహించారని, వాటిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సభలో ‘ఎర్రజెండా ముద్దుబిడ్డ ఏలూరి’ పుస్తక రచయిత పి.సోమయ్య, ఏలూరి సహచరుడు రాజారావు, సీనియర్ నాయకులు బత్తుల హైమావతి, నవతెలంగాణ పబ్లిషింగ్‌హౌస్ ఎడిటర్ ఆనందాచారి, ఏలూరి చిన్న కుమార్తె వరలక్ష్మి, పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు ఎం.సుబ్బారావు తదితరులు మాట్లాడారు. సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి, బండి రమేష్, అన్నవరపు కనకయ్య, బుగ్గవీటి సరళ, సోషల్ మీడియా ఇన్‌చార్జి పిట్టల రవి, ఏలూరు లక్ష్మీనారాయణ సతీమణి ఏలూరి జయమ్మ, ఇతర కుటుంబీకులు పాల్గొన్నారు.
మోడీ సరళీకరణ విధానాలతో ముప్పు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



