నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల బస్ స్టాండ్ వద్ద బిఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వరాష్ట్ర సాధన కోసం పుట్టిన గులాబీ జెండా నేడు తెలంగాణ అభివృద్ధికి ప్రతీకగా నిలిచిందన్నారు. బిఆర్ఎస్ పార్టీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయన్నారు.
రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని వారు ధీమా వ్యక్తం చేశారు. 2028 ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యేగా పుట్ట మధుకర్, రాష్ట్ర సీఎంగా కేసీఆర్ తప్పకుండా గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్తలు కష్టపడి పని చేయాలని, ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు జాగరీ హరీష్, మాజీ ఎంపీటీసీ రావుల కల్పన మొగిలి, బిఆర్ఎస్ నాయకులు అన్నమనేని మధుసుధన్ రావు, దేవర్నేని రాజేశ్వరరావు, బూడిద మల్లేష్, మేనం రాకేష్, ఇనుముల సతీష్, రామిడీ గట్టయ్య, ఆర్నీ సత్తయ్య, లింగారావు, సిద్దుల ఓదెలు, తిక్క వినయ్, మంథని సమ్మయ్య, మహిళలు, యువత, కార్యకర్తలు పాల్గొన్నారు.



