- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన గౌసోద్దిన్ భార్య కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స చేయించుకునేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. విషయం తెలుసుకున్న గ్రామ సేవా సమితి సభ్యులు సోమవారం బాధిత కుటుంబానికి రూ.3000 ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



