నవతెలంగాణ-ఆలేర్ రూరల్
ఆలేరు మండలం సాయిగూడెం గ్రామంలో సోమవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు గ్రామశాఖ అధ్యక్షుడు గంగాధరి సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన నాయకులు,పార్టీ స్థాపన లక్ష్యాలు,అభివృద్ధి దిశగా చేపట్టిన కార్యక్రమాలు,ప్రజా సంక్షేమంపై బీఆర్ఎస్ కట్టుబాటును వివరించారు. గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణంలో కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.ఈ వేడుకల్లో పట్టణ ఉపాధ్యక్షులు బీజని బాల్ రాజు,ఊదరి రాములు, బండి శీను, పుట్ట పవన్,కొండ చంద్రారెడ్డి, ఇంజరాజు,ముద్దేపాక నరసయ్య,ముద్దేపాక లక్ష్మయ్య, సంగీ స్వామి, చింతకాయల రవి,ముత్యం రామచందర్, అల్వాల బాలకృష్ణ, ఆలేటి శ్రీకాంత్,బోగారం మురళి,అల్వాల చంటి, ఆలేటి కర్ణాకర్, కట్టెగొమ్మల సిద్ధారెడ్డి,బీజని సురేష్ తదితరులు పాల్గొన్నారు.
సాయిగూడెంలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
- Advertisement -
- Advertisement -



