Monday, April 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇంటింటికి జన గణన సర్వే  

ఇంటింటికి జన గణన సర్వే  

- Advertisement -

సర్వేకు ప్రజలు సహకరించాలి: తహసీల్దార్ సువర్ణ
నవతెలంగాణ-నసురుల్లాబాద్

జన గణన విధులను పక్కాగా నిర్వహించాలని, అప్పుడే ఆయా వర్గాల ప్రజలకు భవిష్యత్తులో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ఒక అవగాహనకు వచ్చి కార్యాచరణను అమలు చేసేందుకు ఆస్కారం ఉంటుందని తహసీల్దార్ సువర్ణ  సూచించారు. సెన్సెస్ – 2027 ను పురస్కరించుకొని సోమవారం నసురుల్లాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్వే నిర్వాహకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అలాగే బీర్కూర్ మండల కేంద్రంలో జన గణన సర్వేపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సువర్ణ మాట్లాడుతూ సర్వేలో
ఈసారి సెల్ఫ్ డిక్లరేషన్ ఎంతో ముఖ్యమని, అధికారులు, ఎన్యుమరేటర్లు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

చార్జ్ ఆఫీసర్లు ప్రతిరోజూ జన గణన ప్రక్రియను సమీక్షించాలని, తాము కూడా రోజువారీగా పర్యవేక్షణ జరుపుతామని అన్నారు. అందుబాటులో ఉన్న సిబ్బందితో నిర్దేశిత గడువు లోపు జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను మెరుగైన రీతిలో పూర్తి చేసేలా సన్నద్ధం చేయాలన్నారు. ప్రణాళికల రూపకల్పన, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల రూపకల్పనకు దోహదపడే జన గణన ప్రక్రియను నిబద్ధత, అంకితభావంతో నిర్వహించాలన్నారు. జనాభా గణన కోసం ఎలా సన్నద్ధం కావాలి, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ భావయ్య, ఆర్ ఐ వెంకట్ స్వామి, రెవెన్యూ అధికారులు,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -