మున్సిపాలిటీ ఆదాయానికి గండ
పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ – అచ్చంపేట
మునిసిపాలిటీలలో గానీ గ్రామపంచాయతీలలో గానీ వ్యవసాయ భూములు ఇండ్ల స్థలాలుగా మార్చి విక్రయించాలంటే మునిసిపాలిటీ ఆఫీస్ నుంచి లే అవుట్ పర్మిషన్ తీసుకొని ప్రభుత్వాన్ని నిబంధనలకు ప్రకారంగా ఇంటి స్థలాలు ఏర్పాటు చేయవలసి ఉంటుంది. కానీ అచ్చంపేట పట్టణంలో కొందరు వ్యక్తులు వ్యవసాయ భూములను నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్ చేసి విక్రయిస్తున్నారు. విషయం తెలిసిన మునిసిపాలిటీ అధికారులు వ్యక్తిగతంగా మాముళ్ళు ( లంచాలు) తీసుకొని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలా కన్వెన్షన్, ప్లాట్లకు సరిపడా రోడ్డు వెడల్పులు, భవిష్యత్తులో డ్రైనేజీ నిర్మాణం కోసం స్థలం కేటాయించవలసి ఉంటుంది. ముందుగా వదిలిన రోడ్డు అంతర్భాగంలో వీధిలైట్ల కోసం స్తంభాలు ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఇలాంటి సౌకర్యాలు కల్పించకుండానే వ్యవసాయ భూములను ఇళ్ల స్థలాలుగా మారుస్తున్నారు. దీంతో మున్సిపాలిటీ రావాల్సిన ఆదాయం భారిగా నష్టం జరిగింది. మున్సిపాలిటీ అధికారులకు వ్యక్తిగతంగా లబ్ది జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పట్టణంలోని లింగాల రోడ్డు టంగాపురం శివారులో సర్వే నెంబర్ 43/1 లో వ్యవసాయ భూమిలో 34కీ పైగా ప్లాట్లు చేశారు. ఒక్కొక్కటి కొన్ని లక్షల రూపాయలకు అమ్ముతూ.. ప్రభుత్వానికి చెల్లించవలసిన ఫీజులు చెల్లించకుండా వ్యక్తిగతంగా సొమ్ము చేసుకుంటున్నారు. కొనుగోలు చేసిన ప్రజలు రేపు ఇంటీ నిర్మాణం కోసం కచ్చితంగా మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొనుగోలు చేస్తున్న ప్రజలు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు అనధికారికంగా చేసిన వెంచర్లపై దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఉంది.
అనధికారికంగా ఫ్లాట్లు చేసే అమ్మితే చర్యలు తీసుకుంటాం: మురళి మున్సిపల్ కమిషనర్ అచ్చంపేట.
రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములను ప్లాట్లుగా మార్చుతున్న సందర్భంలో మునిసిపాలిటీ కార్యాలయం నుంచి లేఅవుట్ పర్మిషన్ తీసుకోవాలి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 10% స్థలం మున్సిపాలిటీ కేటాయించాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు చేసి అమ్ముతే ఫిర్యాదు చేసినట్లయితే విచారణ చేసి వెంటనే చర్యలు తీసుకుంటాం.



