శారాజీపేట పిహెచ్‌సీ డాక్టర్ హైమావతి
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం కొలనుపాక గ్రామంతో పాటు బైరంనగరం, రాజానగరం,రాఘవపూరం గ్రామాల ప్రజలు రేపు (మంగళవారం) నిర్వహించే మెగా ఆరోగ్య శిబిరాన్ని వినియోగించుకోవాలని శారాజీపేట పిహెచ్‌సీ డాక్టర్ హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు.ప్రజపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఈ శిబిరం ఉదయం 9 గంటలకు కొలనుపాక ఘడిలోని రైతు వేదిక వద్ద ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.శిబిరంలో సాధారణ వైద్య పరీక్షలతో పాటు ఛాతీ ఎక్స్-రే సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు.శిబిరానికి హాజరయ్యే వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు వెంట తీసుకురావాలని కోరారు.ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ హైమావతి సూచించారు.
మెగా ఆరోగ్య శిబిరాన్ని వినియోగించుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



