Wednesday, April 29, 2026
E-PAPER
Homeజాతీయంసుంకాలు లేకుండా న్యూజిలాండ్‌కు భారత్‌ ఎగుమతులు

సుంకాలు లేకుండా న్యూజిలాండ్‌కు భారత్‌ ఎగుమతులు

- Advertisement -

ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు
న్యూఢిల్లీ
: భారత్‌, న్యూజీలాండ్‌ దేశాలు సోమవారం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) కుదుర్చు కున్నాయి. ఉభయ దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడులను పెంపొందిం చేందుకు ఉద్దేశించిన ఈ ఒప్పందంపై భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, న్యూజీలాండ్‌ వాణిజ్య, పెట్టుబడుల మంత్రి టాడ్‌ మెక్‌ క్లే సంతకాలు చేశారు. న్యూజిలాండ్‌కు భారత్‌ చేసే ఎగుమతులపై వంద శాతమూ సుంకాలు లేకుండా వుండేం దుకు ఈ ఒప్పందం వెసులుబాటు కల్పిస్తోంది. అలాగే ఈ ఒప్పందం అన్ని సుంకాల శ్రేణులు లేదా ఉత్పత్తి వర్గాలను కవర్‌ చేస్తోంది. కార్మిక శ్రమ ఎక్కువుగా వుండే రంగాలైన జౌళి, దుస్తులు, తోలు, పాదరక్షలు, రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్‌ వస్తువులు, ప్రాసెస్డ్‌ ఆహారం వంటి రంగాల్లో పోటీ తత్వాన్ని పెంచడం ద్వారా ఉపాధిని పెంపొందిం చడానికి చిన్న, ఒక మోస్తరు తరహా పరిశ్రమలకు గణనీయంగా ఊపుని స్తుందని భావిస్తున్నారు. గతంలో పది శాతం వరకు భారత్‌ ఎగుమతులపై న్యూజీలాండ్‌ టారిఫ్‌లు విధించేంది. పింగాణి, కార్పెట్లు, ఆటోమొబైల్స్‌ ఆటో విడిభాగాలు వంటి రంగాలకు ఇది తప్పనిసరిగా అమలయ్యేది.

తాజాగా కుదిరిన ఒప్పందంతో తయారీ రంగానికి అవసరమయ్యే ఉపకరణాలను అంటే చెక్కలు, బొగ్గు, లోహ వ్యర్ధాలు వంటి వాటిని ఎలాంటి సుంకాలు లేకుండా భారత్‌ తెచ్చుకోగలుగుతుంది. దీనివల్ల ఉత్పత్తి వ్యయాలు తగ్గుతుఆయి, భారత పరిశ్రమలకు అంతర్జాతీయంగా పోటీ తత్వం పెరపొందుతుంది. మరోవైపు భారత్‌ సున్నిత రంగాలను కాపాడుకునేందుకు గానూ 29.97 శాతం టారిఫ్‌ శ్రేణులకు మినహాయింపునిస్తూనే, ద్వైపాక్షిక వాణిజ్య విలువలో 95శాతాన్ని కవర్‌ చేసే 70.03శాతం టారిఫ్‌ శ్రేణులపై పన్నుల సరళీకరణను ప్రతిపాదించింది. మినహాయింపునిచ్చిన ఉత్పత్తుల్లో పాలు, జంతు ఉత్పత్తులు, చక్కెర, కృత్రిమ తేనె, జంతు కొవ్వు లేదా వెజిటబుల్‌ ఆయిల్‌, ఆభరణాలు, రత్నాలు, రాగి, తదితరాలు వున్నాయి. ఇక న్యూజీలాండ్‌ సుంకాల జాబితాలోని 30శాతం ఉత్పత్తులపై అంటే వూలు, చెక్క, మాంసం, ముడి తోలు వంటి ఉత్పత్తులపై భారత్‌ సుంకం తొలగిస్తుంది. భారత్‌లోకి 2వేల కోట్ల డాలర్ల మేరా న్యూజీలాండ్‌ పెట్టుబడులు పెట్టేందుకు ఈ ఒప్పందం వెసులుబాటు కల్పిస్తోంది. రెండు దేశాల మధ్య వస్తువులు, సేవలకు సంబంధించి 2024లో 240కోట్ల డాలర్ల మేరా ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -