Tuesday, April 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అర్హులైన పేదలందరికీ ఇండ్లు,ఇళ్ల స్థలాలు, పెన్షన్లు ఇవ్వాలి

అర్హులైన పేదలందరికీ ఇండ్లు,ఇళ్ల స్థలాలు, పెన్షన్లు ఇవ్వాలి

- Advertisement -

కల్లూరి మల్లేశం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
నవతెలంగాణ – ఆలేరు రూరల్

అర్హులైన పేదలందరికీ ఇండ్లు,ఇళ్ల స్థలాలు,పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు. మంగళవారం రోజున సీపీఐ(ఎం) ఆలేరు మండల, పట్టణ కమిటీల ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి హాజరైన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం  మాట్లాడుతూ.. సీపీఐ(ఎం) పోరుబాటలో భాగంగా మండలంలోని గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికీ తిరిగి ప్రజా సమస్యలను అధ్యయనం చేసినట్లు తెలిపారు. వ్యక్తిగత సమస్యలతో పాటు మౌలిక వసతుల లోపాలపై ప్రజల నుండి వివరాలు సేకరించామని చెప్పారు. ఆ సమస్యల పరిష్కారం కోసం తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టినట్లు తెలిపారు.

మండలంలో అనేకమంది పేదలు ఇండ్లు లేక అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారని అదేవిధంగా చాలీచాలని ఇంటిలో సమస్యలతో జీవనం సాగిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత శాసనసభ ఎన్నికలకు ముందు అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చిందని వాటిని నెరవేర్చడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని, వెంటనే అర్హులైన పేదలందరికీ ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాలుగా పెన్షన్లు లేకపోవడం వలన వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళ బీడీ కార్మికులు అనేక అవస్థలు పడుతున్నారని వెంటనే అర్హత కలిగిన పేదలందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మౌలిక వసతులు కల్పించడం లో కూడా ప్రభుత్వం విఫలమైందని మండలంలో అనేక గ్రామాలు రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని,అనేక చోట్ల గుంతల మయమైన రోడ్లతో ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా మండలంలో ఆలేరు మున్సిపాలిటీ నుండి శర్భనాపురం, మంతపురి  లాంటి గ్రామాలకు వెళ్లాలంటే ఈదుల వాగు పై లో లెవెల్ బ్రిడ్జిలు ఉండడం వలన వర్షాకాలంలో ఇతర గ్రామాలతో రోడ్డు మార్గం తెగిపోతుందని వెంటనే ఈదుల వాగుపై  హై లెవెల్ బ్రిడ్జిలు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆలేరు పట్టణ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న ఆలేరు పెద్దవాగు పై బ్రిడ్జిని వేడల్పు చేయాలని ఈ బ్రిడ్జి ప్రమాదకరంగా ఉండడం వలన వివిధ గ్రామాల నుండి ఆలేరు పట్టణ వచ్చే ప్రజలకు ప్రాణ సంకటనగా ఉందని తెలిపారు.

ఆలేరు పట్టణం నుండి ప్రభుత్వ ఆసుపత్రికి ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లాలంటే ఈ బ్రిడ్జి దాటడం ప్రాణ సంకటంగా మారిందని, ఇక్కడ ప్రమాదాలు జరిగి అనేకమంది ప్రాణాలు కోల్పోయారని చాలామంది వికలాంగుల మారినారని అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. వెంటనే ఆలేరు పెద్దవాగుపై బ్రిడ్జిని వెడల్పు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆలేరు లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి హోదాను పెంచి వంద పడకలతో ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని కోరారు. ఇక్కడి ప్రాంత ప్రజలకు సరిపోయే విధంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలు అందించలేకపోతుందని దాని స్థాయిని పెంచడం వలన ఈ ప్రాంతంలో ఉండే ప్రజల వైద్య అవసరాలు తీసే విధంగా ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్థానిక తహసిల్దార్ గారికి మెమోరాండం ఇచ్చారు. భవిష్యత్తులో ప్రజల సమస్యలు పరిష్కారం కాకుంటే ప్రజలందరినీ సమీకరించి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎంఏ ఇక్బాల్ సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దూపటి వెంకటేష్,లావుడియా రాజు,సూదగాని సత్య రాజయ్య,జూకంటి పౌలు, మోరిగాడి రమేష్, సంగి రాజు,పిక్క గణేష్,మిట్ట శంకరయ్య,వడ్డేమాన్ బాలరాజు,బొమ్మకంటి లక్ష్మీనారాయణ,కారే రాజు కోలా సదానందం,మధ్య బోయిన ఉప్పలయ్య,సాయిని కళ్యాణ్, ఎక్కాలు దేవ్ భాస్కర్,చెక్కిళ్ల అంజమ్మ,జూకంటి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -