Tuesday, April 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే ప్రతి ఒక్కరికి హక్కులు

అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే ప్రతి ఒక్కరికి హక్కులు

- Advertisement -

మద్నూర్ తహసీల్దార్ ఎండి ముజీబ్
నవతెలంగాణ – మద్నూర్
మన దేశంలో ప్రతి ఒక్కరికి హక్కులు లభిస్తున్నాయంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే అని మద్నూర్ మండల తహసీల్దార్ ఎండి ముజీబ్ అన్నారు. మంగళవారం మహనీయుల జయంతి వారోత్సవాల ముగింపు సందర్భంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ముగింపు కార్యక్రమాన్ని లచ్చన్ గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాసిల్దార్ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది మహనీయుల పోరాటం, త్యాగాల వలన సమాజంలో ప్రతి ఒక్కరూ హక్కులు పొందుతున్నారని తెలిపారు.

అంబేద్కర్, సావిత్రి బాయి, పూలే లు ఈ దేశంలో రాజ్యాంగాన్ని అందించి, అంటరానితనం ను రూపుమాపడానికి, విద్య ద్వారానే విజ్ఞానం, ఙ్ఞాన సంపద వస్తుందని, సమాజం అభివృద్ధి చెందుతుంది అని  ఇన్ని హక్కులు సాధించి ఇచ్చిన మహనీయులను రోజూ గుర్తు చేసుకున్నా తక్కువనే అన్నారు. సామాజిక రుగ్మతలు తగ్గాలంటే అది విద్యా ద్వారానే సాధ్యపడుతుందని అన్నారు. అంబేద్కర్  రూపొందించిన రాజ్యాంగం ద్వారానే  మేము ఈ స్థాయిలో ఉన్నామని గుర్తు చేశారు. అనంతరం తహసీల్దార్ ఎం డి ముజీబ్, మండల గిర్దావర్ ఏం శంకర్, లకు ఈ సందర్భంగా శాలువాతో సన్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -