- Advertisement -
అడిషనల్ కలెక్టర్ కు సర్పంచ్, ఉప సర్పంచ్ ఫిర్యాదు
నవతెలంగాణ – మల్హర్ రావు
భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలంలోని తాడిచెర్ల గ్రామానికి చెందిన మానేరు నదిలోని ఇసుకను తాడిచెర్ల శివారులోనే డంపు చేయాలని సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్ మంగళవారం అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాడిచెర్ల వ్యవసాయ భూములు ఓసిపిలో కోల్పోవడంతో రైతులు, కూలీలకు ఉపాది లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇసుకను తాడిచెర్ల వైపు డంపు చేయడంతో రైతులు, కూలీలకు ఉపాది దొరకడంతోపాటు గ్రామపంచాయతీకి ఆదాయం వస్తుందని పేర్కొన్నారు.
- Advertisement -



