సీపీఐ(ఎం) భూపాలపల్లి, కరీంనగర్ నాయకులు
గుండెపోటుతో మృతిచెందిన రాజయ్యకు నివాళులు
నవతెలంగాణ – కరీంనగర్
భూపాలపల్లి ప్రాంతంలో అనేక ఉద్యమాల్లో, పార్టీ నిర్మాణంలో విశేష కృషి చేసిన కామ్రేడ్ రాజయ్య స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామని సీపీఐ(ఎం) భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల కార్యదర్శులు బందు సాయిలు, మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. సోమవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందిన కంపేటి రాజయ్య(67) మృతదేహంపై మంగళవారం ఉదయం రెండు జిల్లాల పార్టీ నాయకత్వం పూలమాలలు వేసి నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజయ్య భూపాలపల్లి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా శ్రమజీవులను ఐక్యం చేసి అనేక పోరాటాలు చేశారన్నారు. ఉద్యమ సమయంలో ఆయనపై పోలీసులు అనేక కేసులు పెట్టారన్నారు. కేసులు, నిర్బంధాలను లెక్కచేయకుండా ప్రజల కోసం పనిచేసిన నిబద్ధత కలిగిన కామ్రేడ్ అని కొనియాడారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చేశారని, జిల్లా ట్రేడ్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా చివరి శ్వాస వరకు పనిచేశారని గుర్తు చేశారు. ఆయన మరణం పార్టీకి ప్రజా సంఘాలకు, పేద ప్రజలకు తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గీట్ల ముకుందరెడ్డి, గుర్రం దేవేందర్, జిల్లా కమిటీ సభ్యులు డి.నరేష్ పటేల్, జిల్లా నాయకులు సిహెచ్ రవికుమార్ బొడ్డు స్వరం తదితరులు పాల్గొన్నారు.
కార్మిక నేత రాజయ్య మరణం తీరని లోటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



