Wednesday, April 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాష్ట్ర విద్యా సదస్సును

రాష్ట్ర విద్యా సదస్సును

- Advertisement -

విజయవంతం చేయండి : టీపీటీఎఫ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ప్రత్యామ్నాయ, ప్రజాతంత్ర విద్యావిధానం కోసం టీపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 30న హైదరాబాద్‌ బాగ్‌ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న రాష్ట్ర విద్యాసదస్సును విజయవంతం చేయాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్‌ కుమార్‌, రాష్ట్ర ప్రదాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి లు పిలుపు నిచ్చారు. ఈ మేరకు మంగళవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. సదస్సుకు ముఖ్య అతిథిగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ఇ.నవీన్‌ నికోలాస్‌, తెలంగాణ ఉద్యమ నాయకులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండ రాం హాజరవుతున్నారని తెలిపారు. జాతీయ విద్యా విధానం – రాజ్యాంగ విలువలు అనే అంశంపై విద్యా ఉద్యమ నాయకులు ప్రొఫెసర్‌ జి.హార గోపాల్‌, తెలంగాణలో అసమాన విద్య -విద్యారంగ సంక్షోభం అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల ప్రొఫెసర్‌ చింతకింది కాశీం, పశ్చిమాసియా యుద్ధం-ప్రపంచ రాజకీయాలు అనే అంశంపై ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు కె.శ్రీనివాస్‌ ప్రసంగిస్తారని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -