సువిక్షిత్, గీతికా రతన్ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధా రంగా రూపొందుతున్న ఫీల్ గుడ్ లవ్ ఎంటర్‌టైనర్ ‘దూరదర్శిని’. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయశంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ నిర్మించారు. అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రం మే 15న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఈ చిత్రం చిత్రలహరి మీట్‌ను బుధవారం మేకర్స్ ఘనంగా నిర్వహించారు. దర్శకుడు కార్తికేయ మాట్లాడుతూ,’అందరూ ఇది కేవలం లవ్‌స్టోరీ అనుకుంటున్నారు. కానీ ఈ చిత్రంలో తల్లిదండ్రులకు, యూత్‌కు, సమా జానికి నచ్చే అంశాలు ఉన్నాయి. అందరికి 90వ దశకం రోజులను గుర్తకు తెస్తుంది. ప్రతి ఒక్కరికి చిత్రలహరి పోగ్రామ్ కోసం వేచి చూసిన రోజులు గుర్తుకు వస్తాయి. ఈ సినిమాలో మంచి ఎమోషన్ ఉంది. అందరి హదయాలను హత్తుకుంటుంది. సువిక్షిత్‌కు హీరోగా మంచి పేరును తీసుకొస్తుంది. ఈ సినిమా పతాక సన్నివేశాలు అందర్ని ఆలోచింప జేస్తాయి’ అని అన్నారు. హీరో సువిక్షిత్ మాట్లాడుతూ, ‘అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఓ పెద్దాయన భిక్షాటన చేస్తూ కనిపించాడు. ఆయనతో మాట్లా డినప్పుడు ఆయన చెప్పిన లైఫ్ స్టోరియే సినిమా ఇది. ఆయన సొంత కొడుకు వల్ల ఆ పెద్దాయన బిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఈ కథ. యదార్థ సంఘటన చుట్టు అల్లుకున్న కథ ఇది. ఈ సినిమా చూసి కన్నీళ్ళు పెట్టుకోకుండా ఉంటే వాళ్ల లైఫ్‌ను నేను సెటిల్ చేస్తాను. దూరదర్శిని ఓ జంటను ఎలా కలిపింది అనేది కథ. ఆద్యంతం భావోద్వేగభరితంగా ఉండే చిత్రమిది. అందరికీ తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని తెలిపారు.



