నవతెలంగాణ -ఆత్మకూరు
పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని స్పెక్ట్రా ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. టి. లక్ష్మి 559/600 మార్కులు సాధించి పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే సిహెచ్. యస్విత్ 542 మార్కులతో ద్వితీయ స్థానం, బి. అకిరిత 536 మార్కులతో తృతీయ స్థానం దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ వి. సత్యనారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ యం. సంతోష్, ఉపాధ్యాయులు టి. లక్ష్మి, యం. జ్ఞానేశ్వరి రెడ్డి, రాజేందర్, తిరుమలేష్, మమత విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విజయం వెనుక ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహకారం, పాఠశాల యాజమాన్యం ప్రోత్సాహం ఉందని ప్రిన్సిపాల్ యం. సంతోష్ తెలిపారు. స్పెక్ట్రా పాఠశాల ప్రతి ఏటా మెరుగైన ఫలితాలు సాధిస్తూ మండలంలోనే ఆదర్శంగా నిలుస్తోందని స్థానికులు కొనియాడారు.
పది ఫలితాల్లో స్పెక్ట్రా హైస్కూల్ విద్యార్థుల హవా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



