Wednesday, April 29, 2026
E-PAPER
Homeఆదిలాబాద్పది ఫలితాల్లో కస్తూర్బా గాంధీ విద్యార్థుల ప్రభంజనం

పది ఫలితాల్లో కస్తూర్బా గాంధీ విద్యార్థుల ప్రభంజనం

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
బుధువారం విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితల్లో మండల కేంద్రమైన కుభీర్ కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థిని ఎస్ వర్ష 568/600 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో కుభీర్ ఉన్నత పాఠశాల కు చెందిన విద్యార్థిని రచిత 555 మార్కులు సాధించారు.  కస్తూరిబా గాంధీ టి పూజ 554 మార్కులు సాధించి మూడో స్థానంలో నిలిచారు. మండలంలో మొత్తం 286 మంది విద్యార్థులకు 285 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 99.65% ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా విద్యాధికారి విజయ్ కుమార్ విద్యార్థులను అభినదించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో ఆయా ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలో మండల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు గానూ ఆయన విద్యార్థి విద్యార్థులకు, అధ్యాపక బృందానికి సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా పది ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో మరెన్నో శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -