Wednesday, April 29, 2026
E-PAPER
Homeసినిమా'కర'కి అందరూ కనెక్ట్‌ అవుతారు

‘కర’కి అందరూ కనెక్ట్‌ అవుతారు

- Advertisement -

‘సాధారణ ప్రేక్షకు లందరికీ ‘కర’ సినిమా కనెక్ట్‌ అవుతుంది. ఓ సాధారణ మనిషికి ఎదు రయ్యే సమస్యల్ని చాలా స్ట్రాంగ్‌, ఎమోషనల్‌ కంటెంట్‌తో చూడబోతున్నాం’ అని విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత సీహెచ్‌.సతీష్‌కుమార్‌ చెప్పారు. ధనుష్‌, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్‌ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్‌ నిర్మించిన చిత్రం ‘కర’. ఈ మూవీకి విఘ్నేశ్‌ రాజా దర్శకత్వం వహించారు.
ఈ సినిమాని నేడు (గురువారం) విఘ్నేశ్వర ఎంటర్టై న్మెంట్స్‌, ఆర్‌ స్టార్‌ లాజిస్టిక్స్‌ తెలుగులో రిలీజ్‌ చేసున్నారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్‌ అధినేత సీహెచ్‌. సతీష్‌ కుమార్‌ మీడియాతో చిత్ర విశేషాల్ని షేర్‌ చేసుకున్నారు. మాది విశాఖపట్నం. చిన్న సినిమాల్ని కొంటూ డిస్ట్రిబ్యూషన్‌ స్టార్‌ చేశాను. ఆ తరువాత ఓ మూవీని కూడా నిర్మించాను. ‘అర్జున్‌ రెడ్డి’, ‘కబాలి’, ‘సింగం 3’, ‘సలార్‌’, ‘కాంతారా చాప్టర్‌ 1’ వంటి సినిమాల్ని ఉత్తరాంధ్రలో డిస్ట్రిబ్యూట్‌ చేశాను. ధనుష్‌ ‘ధర్మయోగి’ సినిమాని తెలుగులో రిలీజ్‌ చేశాను. ప్రొడక్షన్‌లోనూ మంచి సినిమాల్ని చేయాలని అనుకుంటున్నాను. ఈ ‘కర’ మూవీ కోసం నా స్నేహితుడు రాజేష్‌ సపోర్ట్‌ తీసుకున్నాను.

ధనుష్‌కి మంచి మార్కెట్‌ ఉంది. ఇందులోని మంచి కంటెంట్‌ వల్ల ఈ మూవీ గొప్ప విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది. అందుకే ఈ సినిమాని తెలుగులో రిలీజ్‌ చేస్తున్నాను. ఇక ధనుష్‌ సినిమా అంటే చాలా మంది పోటీ పడతారు. కానీ నేను పర్సనల్‌గా కేర్‌ తీసుకుని నిర్మాత గణేష్‌ని అప్రోచ్‌ అయ్యాను. నా ప్రయత్నం చూసి ఈ చిత్రాన్ని నాకు ఇచ్చారు. 80 శాతం బిజినెస్‌ ఇప్పటికే కంప్లీట్‌ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. నైజాంలో దిల్‌ రాజు డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. అలా ఒక్కో ఏరియాలో ఒక్కొక్కరికి ఇచ్చాం. నేను ఉత్తరాంధ్ర ఏరియాకి డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నాను. దాదాపు 400కు పైగా స్క్రీన్లలో రిలీజ్‌ చేస్తున్నాం. హిందీ వర్షెన్‌తో కలిపితే 600కి పైగా స్క్రీన్లలో వచ్చే అవకాశం ఉంది. థియేటర్ల బంద్‌ అనేది ఉండకపోవచ్చు. మంచి కంటెంట్‌ మూవీ వస్తుంటే థియేటర్ల బంద్‌ అనేది ఉండదు. అసలే సమ్మర్‌లో ఇంత వరకు ఓ పెద్ద సినిమా కూడా రాలేదు.

మా ఈ ‘కర’ మూవీకి అందరూ సపోర్ట్‌ చేస్తారని ఆశిస్తున్నాను. కరస్వామి అనే వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అందుకే తెలుగులో ‘కర’ అనే టైటిల్‌ను పెట్టారు. ‘పోరు తొళిల్‌’ నాకు ఎంతో ఇష్టమైన సినిమా. విఘ్నేశ్‌ మేకింగ్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు థ్రిల్లింగ్‌ ఫ్యాక్టర్స్‌ ఎన్నో ఉన్నాయి. ఇది పెద్ద హిట్‌ అవుతుందనే నమ్మకంతో ధనుష్‌ ఉన్నారు. లోకల్‌ విలేజ్‌ అని కాకుండా ఇంటర్నేషనల్‌ రిలేటెడ్‌ కంటెంట్‌ కూడా ఉంటుంది. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల్ని కూడా ఇందులో చూపిస్తు న్నారు. జీవీ ప్రకాష్‌ సంగీతం బాగుంటుంది. మరికొన్ని పాటలు డైరెక్ట్‌గా తెరపైనే చూడాలి. అన్ని పాటలు స్క్రీన్‌ పై అద్భుతంగా ఉంటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -