Thursday, April 30, 2026
E-PAPER
Homeఆటలుఆయుష్‌, ప్రణయ్‌ మెరిసెన్‌

ఆయుష్‌, ప్రణయ్‌ మెరిసెన్‌

- Advertisement -

2-3తో చైనా చేతిలో భారత్‌ ఓటమి
హార్సెన్స్‌ (డెన్మార్క్‌) :
థామస్‌ కప్‌లో క్వార్టర్‌ఫైనల్లో చోటు సాధించిన టీమ్‌ ఇండియా.. గ్రూప్‌ దశను ఓటమితో ముగించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో అగ్ర జట్టు చైనా చేతిలో 2-3తో ఓటమి పాలైంది. సింగిల్స్‌లో ఆయుష్‌ శెట్టి 17-21, 21-13, 21-15తో వెంగ్‌ హాంగ్‌ యాంగ్‌పై గెలుపొందగా.. హెచ్‌.ఎస్‌ ప్రణరు 20-22, 21-19, 21-111తో లు జుపై పైచేయి సాధించాడు. మరో సింగిల్స్‌లో లక్ష్యసేన్‌.. డబుల్స్‌లో సాత్విక్‌, చిరాగ్‌ జోడీ..హరిహరన్‌, ఎంఆర్‌ అర్జున్‌లు నిరాశపరిచారు. గ్రూప్‌ దశలో ఆస్ట్రేలియా, కెనడాపై విజయంతో భారత్‌ ఇప్పటికే క్వార్టర్స్‌కు చేరుకుంది. ఉబర్‌ కప్‌లో భారత మహిళల జట్టు గ్రూప్‌ దశ నుంచే నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -