Thursday, April 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకారు అతివేగం..ఒకరు మృతి..మరో ఇద్దరికి..

కారు అతివేగం..ఒకరు మృతి..మరో ఇద్దరికి..

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: కారు అదుపుతప్పి ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై మిర్యాలగూడ పట్టణంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం మైసమ్మకుంట తండాకు చెందిన మెగావత్‌ మంగ్తా (45) మిర్యాలగూడ పట్టణంలోని ఐసీసీఐ బ్యాంకు సెక్యురిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం అతడు ద్విచక్ర వాహనంపై మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు వద్ద అద్దంకి–నార్కట్‌పల్లి రహదారి దాటుతుండగా.. గుంటూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు అదుపుతప్పి ఢీకొట్టింది. అంతేకాకుండా కారు రోడ్డు పక్కన ఆపి ఉన్న మరో రెండు బైక్‌లను, ట్రాక్టర్‌ను ఢీకొని ఆగిపోయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -