Thursday, July 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో 98 శాతం ఉత్తీర్ణత

ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో 98 శాతం ఉత్తీర్ణత

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదోవతరగతి పరీక్ష ఫలితాల్లో మండలం ఎడ్లపల్లి గ్రామపరిధి జంగిడిపల్లిలోని తెలంగాణ మోడల్ స్కూల్లో 98శాతం ఉత్తీర్ణత సాధించినట్లుగా పాఠశాల ప్రిన్స్ పాల్ పూర్ణచందర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో మొత్తం 48 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కాగా విడుదలైన ఫలితాల్లో 47 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైయ్యారని తెలిపారు. ఉత్తమమైన ఫలితాలు రావడానికి కృషి చేసినటువంటి విద్యార్థులకు, అధ్యపక బృందానికి, సహకరించిన తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల టాపర్ గా 536 మార్కులతో బి.మనస్విని నీలిచినట్లుగా తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -