Friday, May 1, 2026
E-PAPER
Homeఆటలుక్రీడాభివృద్ధికి దిక్సూచి 'స్పోర్ట్స్‌ యూనివర్శిటీ'

క్రీడాభివృద్ధికి దిక్సూచి ‘స్పోర్ట్స్‌ యూనివర్శిటీ’

- Advertisement -

తెలంగాణ క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌ :

తెలంగాణలో క్రీడల అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. స్పోర్ట్స్‌ విశ్వవిద్యాలయం అందుకు దిక్సూచిలా పని చేస్తుందని క్రీడామంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ అన్నారు. యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. రాష్ట్రంలో బలమైన, స్థిరమైన క్రీడా వ్యవస్థ ఏర్పాటు సహా క్రీడా రంగంలో ఉన్నత విద్య, క్రీడా నైపుణ్యాలకు పెంపునకు శిక్షణకు ఈ సదస్సు దిశానిర్దేశం చేయటం సంతోషకరమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్‌ రెడ్డి, శాట్జ్‌ ఎండీ సోనీబాలా దేవి, స్పోర్ట్స్‌ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ కిశోర్‌ గోపీనాథ్‌, క్రీడాకారులు, స్పోర్ట్స్‌ స్టూడెంట్స్‌, క్రీడా ప్రాధికార సంస్థ కోచ్‌లు, అధికారులు తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -