Friday, May 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమే 1 నుంచివిద్యుత్‌ భద్రతా వారోత్సవాలు

మే 1 నుంచివిద్యుత్‌ భద్రతా వారోత్సవాలు

- Advertisement -

ప్రమాదాలను సున్నాస్థాయికి తీసుకురావడమే లక్ష్యం : సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి వెల్లడి
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

విద్యుత్‌ వినియోగదారుల్లో భద్రతాపరమైన అవగాహనను పెంపొందించే లక్ష్యంతో మే1 నుంచి 7వ తేదీ వరకు ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలోని 18 సర్కిళ్లలో విద్యుత్‌ భద్రతా వారోత్సవాలు నిర్వహించనున్నట్టు సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ప్రకటించారు. గురువారం ఎన్‌పీడీసీఎల్‌ రాజన్న సిరిసిల్ల సర్కిల్‌లోని ఎస్‌ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యుత్‌ భద్రతకు సంబంధించిన వాల్‌ పోస్టర్లు, కరపత్రాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఓఅండ్‌ఎం విభాగపు సిబ్బందితో మాట్లాడి నిర్ధారిత భద్రతా పరికరాలను సక్రమంగా వినియోగిస్తున్నారా? అనే విషయాన్ని స్వయంగా పరిశీలించారు. విద్యుత్‌ లైన్ల నిర్వహణను క్రమం తప్పకుండా చేపట్టి, వినియోగదారులకు అంతరాయ రహితంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందించాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా పర్యటించి, ప్రజలకు, రైతులకు విద్యుత్‌ భద్రతపై సమగ్ర అవగాహన కల్పించాలని సీఎండీ ఆదేశించారు. సమావేశాలు, ప్రచార కార్యక్రమాల ద్వారా భద్రతా ప్రమాణాలపై పూర్తి అవగాహన కలిగించాలని చెప్పారు. విద్యుత్‌ ప్రమాదాలు అధికశాతం నిర్లక్ష్యం, అజాగ్రత్త , సరైన అవగాహన లేకపోవడం వల్లనే సంభవిస్తున్నాయని ఆయన వ్యక్తం చేశారు. తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రతి ప్రమాదాన్నీ పూర్తిగా నివారించొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల ఎస్‌ఈ టి.వేణు మాధవ్‌, ఎస్‌ఈ డిపిఈ పి.శ్రీకాంత్‌, డిఈలు రమణ, అంజయ్య, రమణ రెడ్డి, ఏడిఈ, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -