Friday, May 1, 2026
E-PAPER
Homeఆటలు56 మందితో జంబో జట్టు

56 మందితో జంబో జట్టు

- Advertisement -

ఆసియా అండర్‌-15, 17 చాంపియన్‌షిప్స్‌
న్యూఢిల్లీ :
ప్రతిష్టాత్మక ఆసియా అండర్‌-15, అండర్‌-17 బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌ పోటీలకు భారత్‌ జంబో జట్టును బరిలోకి దించుతోంది. ఇటీవల ఆసియా సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో పతకాల పంచ్‌ విసిరిన భారత్‌.. ఏజ్‌ గ్రూప్‌ పోటీల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఉబ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌ వేదికగా నేటి నుంచి ఆసియా అండర్‌-15, 17 పోటీలు ఆరంభం కానున్నాయి. అండర్‌-17 బాలురు, బాలికల విభాగంలో భారత్‌ 13 మంది బాక్సర్ల చొప్పున బరిలోకి దింపుతోంది. అండర్‌-15 బాలికలు, బాలుర విభాగాల్లో వరుసగా 15 మంది బాక్సర్ల చొప్పున పోటీపడనున్నారు. వర్థమాన బాక్సర్లను గుర్తించేందుకు ఈ టోర్నమెంట్‌ గొప్ప సాధనంగా ఉపయోగపడనుంది. సత్తా చాటిన బాక్సర్లు భారత్‌ తరఫున సీనియర్‌ విభాగంలో బరిలోకి దిగే అవకాశం దక్కించుకోనున్నారు!.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -