Saturday, May 2, 2026
E-PAPER
Homeవరంగల్బుద్ధుని బోధనలు ప్రపంచ మానవాళికి ఆదర్శం: పీక కిరణ్

బుద్ధుని బోధనలు ప్రపంచ మానవాళికి ఆదర్శం: పీక కిరణ్

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా కాటారం కేంద్రం లో గల గారేపల్లిలోని జై భీమ్ అంబేద్కర్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుద్ధుని చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ మాట్లాడుతూ, గౌతమ బుద్ధుడు రాజ్య సుఖాలను త్యజించి ప్రపంచ మానవాళికి ధర్మం, సత్యం, న్యాయం, ప్రేమ వంటి విలువలను అందించిన మహానుభావుడని పేర్కొన్నారు. ఆయన బోధనలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ బుద్ధుని ఆలోచనలను ఆచరణలో పెట్టి శాంతి, సమానత్వం వైపు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో దళిత బంధు సాధన సమితి జిల్లా అధ్యక్షుడు సంపత్ మహారాజు, యువైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్, కొండన్న తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -