Saturday, May 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వేసవికాల క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ కుంచాల

వేసవికాల క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ కుంచాల

- Advertisement -

నవతెలంగాణ-తుంగతుర్తి
శారీరక దృఢత్వం,మానసిక ఉల్లాసం,క్రమశిక్షణ,సామాజిక నైపుణ్యాలను పెంపొందించడంలో క్రీడలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని అన్నారం గ్రామ సర్పంచ్ కుంచాల tశ్రీనివాస్ రెడ్డి అన్నారు.శనివారం అన్నారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు,జిల్లా యువజన క్రీడల సమాఖ్య సూర్యాపేట వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేసవికాల క్రీడాశిక్షణ శిబిరాన్ని స్థానిక ప్రధానోపాధ్యాయులు బింగి లక్ష్మయ్య తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఈ మేరకు యువత,క్రీడాభిమానులు వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అంతకుముందు ప్రధానోపాధ్యాయులు బింగి లక్ష్మయ్య మాట్లాడుతూ వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా క్రీడల్లో పాల్గొనాలని సూచించారు.ఈ శిబిరాల వల్ల విద్యార్థుల్లో విజ్ఞానం,మానసిక వికాసం పెంపొందించడంతోపాటు వినోదాన్ని అందించేందుకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.

క్రీడలు ఒత్తిడిని,ఆందోళనను తగ్గించి,మెదడు చురుకుదనాన్ని పెంచుతాయని,క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయని అన్నారు.క్రీడల ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని,సామాజిక సంబంధాలు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడటం,కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయని తెలిపారు.విద్యార్థులకు క్రీడలు ఏకాగ్రతను పెంచి చదువులో మంచి ప్రతిభ కనబరచడానికి సహాయపడతాయన్నారు. మొబైల్ వాడకాన్ని తగ్గించి క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు.ఖాళీ సమయాల్లో పేపర్,కథల పుస్తకాలను,జాతీయ నాయకుల జీవిత చరిత్రలు చదవాలని సూచించారు. అనంతరం పదవ తరగతి ఫలితాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించి,మండలంలో 541 మార్కులతో ద్వితీయ స్థానం సాధించిన,స్థానిక పాఠశాల విద్యార్థిని పి.విశ్వితను ఘనంగా సన్మానించి కేక్ కట్ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు సభ్యులు బల్లెం ప్రవీణ్,గ్రామ యువత మట్టపల్లి వెంకట్,మన్నూరి పోతరాజు,పాఠశాల పీడీ కార్తీక్ రెడ్డి,సూర్యాపేట జిల్లా అథ్లెటిక్స్ కోచ్ వెంకటేష్, సోలిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీఈటి వినయ్ కుమార్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -