నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం త్రిపురారం మండలం, పెద్దదేవులపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం, శిఖర ప్రతిష్ట, ఆంజనేయస్వామి విగ్రహ సమ్మాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండన్న మహా అన్నదాన కార్యక్రమం గ్రామ సర్పంచ్ గుండెబోయిన వెంకటేశ్వర్లు సమక్షంలో చేపట్టారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా వచ్చి తీర్ధప్రసాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కొప్పుసోమయ్య, ఇరిగి మహేష్, గుండెబోయిన కాశయ్య, గుండెబోయిన వెంకన్న, అంబటి వేణు, సింగం అంజయ్య, గౌని రమేష్, పబ్బతి చినబాబు, దైద రవి, చారగండ్ల సత్యం, బత్తుల రామకృష్ణ, సకినాల సైదులు, ఠాకూర్ బాబు, సుబ్బు సింగ్, అంజయ్య, సురెందర్ సింగ్, దుర్గా సింగ్, వనం వెంకన్న, పెద్దదేవులపల్లి గ్రామస్తులు, బుసిరెడ్డి ఫౌండేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
మహా అన్నదాన కార్యక్రమం చేపట్టిన బుసిరెడ్డి పాండన్న
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



