Saturday, May 2, 2026
E-PAPER
Homeజిల్లాలురోడ్డెక్కిన అన్నదాతలు.. రహదారిపై ధర్నాతో ఉద్రిక్తత

రోడ్డెక్కిన అన్నదాతలు.. రహదారిపై ధర్నాతో ఉద్రిక్తత

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
వడ్ల కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శనివారం అన్నదాతలు రోడ్డెక్కారు. దీంతో కొద్దిసేపు రహదారిపై ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ 44వ నంబరు జాతీయ రహదారి శివాలయం సమీపంలో వడ్ల కొనుగోలు లో తీవ్ర జాప్యం జరుగుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేసినారు. ఈ సందర్భంగా బి జె పి జిల్లా ఉపాధ్యక్షుడు  పాలెపు రాజు ,సొసైటీ మాజీ చైర్మన్ నచ్చు చిన్నారెడ్డి తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని సొసైటీ అధికారులపై సైతం తీవ్రంగా మండిపడ్డారు. వరి  కొనుగోలు కేంద్రం ప్రారంభించి 15 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు రైస్ మిల్లులకు రైతుల ధాన్యాన్ని తరలించిన దాఖలాలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు.

కొనుగోలు కేంద్రంలో కాంట నిర్వహించి ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించిన తర్వాత కూడా లారీలలో ఉన్న లోడును మిల్లుల యజమానులు ఖాళీ చేయడం లేదని ఆరోపించారు. వారం రోజులుగా రైతులు తమ వరి ధాన్యాన్ని కేంద్రం వద్ద ఉంచిన ఎలాంటి తూకాలు జరగడం లేదని అధికారుల నిర్లక్ష్య వైఖరి పట్ల మండిపడ్డారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలలో చురుకుగా ధాన్యం కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఇకముందు మరింత ఉధృతంగా ధర్నా చేపడతామని హెచ్చరించారు. ధర్నా నిర్వహిస్తున్న సంఘటన స్థలానికి స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ విచ్చేసి  రైతులతో మాట్లాడారు. శాంతియుతంగా అధికారులతో సమస్యను చర్చించి పరిష్కరించుకోవాలని సూచించి ధర్నాను విరమింప చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో  అల్లూరి గంగారెడ్డి, నూతల శ్రీనివాస్ రెడ్డి, రైతులు  పెద్దకాపు రవి రెడ్డి, నచ్చు గంగారెడ్డి, చేపూర్ శ్రీనివాస్ రెడ్డి, నచ్చు మోహన్, చేపూర్ రాజు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -