- Advertisement -
– భద్రతకు గ్రామస్తుల ముందడుగు
నవతెలంగాణ – కామారెడ్డి
ఆరేపల్లి గ్రామంలో గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్ , మాచారెడ్డి ఎస్ఐ అనిల్, మాచారెడ్డి పోలీస్ సిబ్బంది కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ, “ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం” అని పేర్కొన్నారు. గ్రామాల్లో భద్రతను పెంపొందించేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరమని తెలిపారు. మాచారెడ్డి పాల్వంచ మండలాల ప్రజలు తమ గ్రామాల్లో ఈ విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరేపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతి సెక్రటరీ, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



