పూట గడవటమే గగనం..ఇదీ గాజా కార్మికుల దుస్థితి
మేడే నేపథ్యంలో యుద్ధోన్మాద అమెరికా, ఇజ్రాయిల్‌పై ఆగ్రహం
గాజా: యుద్ధానికి ముందు గాజా నగరం నిత్యం ఎంతో రద్దీగా ఉండేది. కార్మికులు ఎవరి పనుల్లో వారు నిమగమై ఉండేవారు. తిండికి ఎలాంటి లోటు ఉండేది కాదు. కానీ రెండేండ్లకుపైగా సాగిన యుద్ధంతో అక్కడి ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారింది. కార్మికులకు పూట గడవటమే గగనమె ౖపోయింది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడి కార్మికులు శుక్రవారం మేడే జరుపుకున్నారు. ఇరాన్, పాలస్తీనాపై అమెరికా, ఇజ్రాయిల్ దాడుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ యుద్ధాలతో తమ జీవితాలు తారుమారై పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తీవ్ర సంక్షోభం…
గాజాలో అక్టోబర్ 2023 నుంచి కొనసాగుతున్న యుద్ధం ఆర్థిక వ్యవస్థను, కార్మిక మార్కెట్‌ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. దీంతో 2,50,000 మందికి పైగా కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగాలు చేస్తున్న వారు కనీస అవసరాలు తీర్చుకోవడానికి సరిపడా మాత్రమే సంపాదిస్తున్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం గాజాలో నిరుద్యోగం కొంచెంకొంచెంగా పెరుగుతూ ఇప్పుడు 80 శాతానికి చేరుకుంది. యుద్ధంతో గాజాలో పేదరికం రేటు 93 శాతానికి పైగా పెరిగింది. వీరిలో 75 శాతానికిపైగా తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. మానవతా సంస్థల కార్యకలాపాలపై విధించిన ఆంక్షలు కూడా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి. ముఖ్యంగా, తమ ఆదాయ వనరులను పూర్తిగా కోల్పోయిన కార్మికులతో సహా, ప్రస్తుతం 95 శాతానికి పైగా జనాభా మానవతా సహాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. గాజాపై ఇజ్రాయిల్ దిగ్బంధనాన్ని ఎత్తివేసి, సరిహద్దు మార్గాలను తెరిచి, ఉత్పాదక రంగాలను తిరిగి పని ప్రారంభించేలా చేస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాదు. ఇలాగే ఉద్యోగాల కొరత కొనసాగితే అది ఆర్థిక స్తబ్దతను మరింత తీవ్రతరం చేస్తుందని, కార్యాచరణ సామర్థ్యాన్ని తగ్గిస్తుందని, కోలుకునే అవకాశాలనూ దెబ్బతీస్తుందని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
కఠినమైన జీవన పోరాటం
యూసుఫ్ అల్-రిఫీ 32 ఏండ్లు ఉంటాయి. గాజా నగరంలో రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఒక తాత్కాలిక బేకరీలో పనిచేస్తున్నాడు. తన కుటుంబాన్ని, ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి ఆయనకు ఇదొక ఉపాధి మార్గంగా మారింది. యుద్ధానికి ముందు, నగరానికి తూర్పు వైపున తన తండ్రి, సోదరులతో భాగస్వామ్యంతో యూసుఫ్ ఒక చిన్న బేకరీని నడిపేవాడు. అయితే యుద్ధ సమయంలో వారి నివాసంతో పాటు ఆ బేకరీ పూర్తిగా ధ్వంసమైపోయాయి. దీంతో ఏ పని లేక రెండేండ్ల పాటు యూసుఫ్ ఖాళీగానే ఉన్నాడు. ఆ నష్టాన్ని చవిచూసిన యూసుఫ్ ఇటీవలే రహదారి పక్కన ఉన్న బేకరీలో పనిచేయడం ప్రారంభించాడు. కానీ తాను సంపాదించేది కుటుంబ, పిల్లల ఖర్చులకు సరిపోవడం లేదు. దీంతో చుట్టుపక్కల అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ”నేను ఇక్కడ బేకరీలో మరికొందరు కార్మికులతో కలిసి పనిచేస్తున్నా. బేకరీ పనుల్లో అనుభవమున్నా ప్రస్తుత పనితీరు యుద్ధానికి ముందు నేను చేసిన పనిని పోలి ఉండదు. యుద్ధ ప్రభావం కేవలం పనికి మాత్రమే పరిమితం కాలేదని, జీవన పరిస్థితులు, భవిష్యత్తుపై తనకు ఉన్న ఆశలన్నీ నాశనం చేసింది. ఇల్లు గడవడానికి ఆహార, పానీయాల కోసం నా మొబైల్ ఫోన్, నా భార్య ఫోన్ అమ్మేశాను” అని బాధగా చెప్పాడు.
ఇబ్రహీం అబు అల్-ఈష్ అకౌంటింగ్‌లో పట్టభద్రుడు. గాజాలో యుద్ధంతో ఉద్యోగం కోల్పోయాడు. కుటుంబం గడవడం కష్టమైంది. ఉత్తర గాజాలోని జబాలియాలో ఉన్న ఒక నిర్వాసిత శిబిరంలో తన తల్లిదండ్రులు, తోబుట్టువులతో సహా తొమ్మిది మంది సభ్యులున్న కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత అతనిపై పడింది. దీంతో ఇబ్రహీం జీతం తక్కువైనా, తను చేసే పనిలో ప్రమాదం ఎక్కువని తెలిసినా అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్నైనా అందిపుచ్చుకోవడానికి సిద్ధమయ్యాడు. ఒక స్థానిక కాంట్రాక్టింగ్ కంపెనీలో కూలీగా వెళ్లాడు. గాజా నగరంలో ధ్వంసమైన భవనం శిథిలాల వద్ద బుల్డోజర్‌కు దారి సిద్ధం చేయడానికి రాళ్లను, కూలిపోయిన పైకప్పును తొలగించడంలో నిమగమయ్యాడు. యుద్ధం వల్ల గాజాలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ ఆయనకు ఆ పని దొరకడం పట్ల కాస్త సంతోషంగానే ఉన్నాడు. ఈ సందర్భంగా ఇబ్రహీం మాట్లాడుతూ ”గాజాలోని పరిస్థితులు కార్మికులకు అత్యంత కష్టతరమైన పని వాతావరణాన్ని సృష్టించాయి. వారిలో చాలామంది యుద్ధ సమయంలో తమ ఉద్యోగాలను, వృత్తులను కోల్పోయారు. అందులో నేనూ ఉన్నాను. ఇప్పుడు నేను చేస్తున్న పని అత్యంత కష్టమైనది, అసురక్షితమైనది. కానీ తమ కుటుంబ ఆకలి తీర్చాలంటే తప్పదు. ఈ పని చేస్తుండగా నేను చాలాసార్లు గాయపడ్డా. నా జీవితంలో నేను ఇలాంటి వృత్తిలో పని చేస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ” అని వాపోయాడు.
బతుకు పోరాటం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



