మందుపాతర తొలగిస్తుండగా పేలుడు
చర్ల: మందుపాతర తొలగిస్తుండగా నలుగురు జవాన్లు మృతి చెందిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్-నారాయణపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఛోటేబెతియా పోలీస్ స్టేషన్ సరిహద్దు ప్రాంతంలో శనివారం జవాన్లు మందుపాతరల తొలగింపు(డీ – మైనింగ్) చేపట్టారు. ఈ క్రమంలో రోడ్డుపై అమర్చిన మందుపాతరను తొలగిస్తుండగా.. ప్రమాదవ శాత్తు అది పేలింది. ఈ ఘటనలో కాంకేర్ డీఆర్జీకి చెందిన ఇన్‌స్పెక్టర్ శుక్రామ్ వట్టి, కానిస్టేబుళ్లు కృష్ణ కొమర, సంజరు గట్పల్లి సంఘటన స్థలంలోనే మృతి చెందారు. గాయపడిన కానిస్టేబుల్ పరమానంద్ కుమార్‌ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ఈ ఘటనను ధ్రువీకరించారు.
ఛత్తీస్‌గఢ్‌లో నలుగురు జవాన్లు మృతి
- Advertisement -
- Advertisement -



