వాడవాడలో తిరుగుతూ  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి

నవతెలంగాణ -కంటేశ్వర్: నిజామాబాద్ పట్టణంలోని చంద్రశేఖర్ కాలనీలో వాడవాడ తిరుగుతూ విన్నుత రీతిలో చాయ్ చేస్తూ, బట్టలు ఇస్త్రీ చేస్తూ ఎన్నికల ప్రచారం  అర్బన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ మంగళవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర పరిస్థితి మారలేదన్నారు. రాష్ట్రం సిద్ధించి తొమ్మిదేళ్లు అవుతున్నా యువత నిరుద్యోగంతో మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.నిజామాబాద్ పట్టణంలో అభివృద్ధి కంటే పది రెట్లు ఎక్కువ అవినీతి జరుగుతుందన్నారు. వాడవాడలో తిరుగుతు ప్రజల సమస్యలు చూస్తుంటే గుండె తరుక్కు పోతుంది అన్నారు. సమస్యలన్నీ తీరాలంటే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని అన్నారు.ఓటర్లను కలుస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని షబ్బీర్ అలీ కోరారు.కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల గురించి వివరించారు. అర్హులందరికి ఫించన్ రావడం లేదు. లబ్ధిదారులకు తెల్లరేషన్ కార్డులు ఇవ్వడం లేదని విమర్శించారు. కాంగ్రెస్కి నిజామాబాద్ కంచుకోటలా ఉందన్నారు. పాదయాత్రలో సర్వ కుల, మతాల ప్రజలు బ్రహ్మరథం పడుతూ మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు తహర్ బిన్ హందన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్,సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు, యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా జాతీయ సమన్వయకర్త నిహార్, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విపుల్, జిల్లా ఎన్,ఎస్,యు,ఐ  అధ్యక్షులు వేణు,స్వామి గౌడ్, సబర్, నూర్, ప్రవీణ్ గౌడ్, సత్యనారాయణ యాదవ్, ప్రకాష్ గౌడ్, తతిదరులు పాల్గొన్నారు.
Spread the love