నవతెలంగాణ కంటేశ్వర్: నిజామాబాదు నగరం లోని 36 వ డివిజన్ హమాలీవాడి లో లో బీజేపీ అభ్యర్థి దన్ పాల్ సూర్యనారాయణ ఇంటి ఇంటి ప్రచారం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్బంగా సూర్యనారాయణ మాట్లాడుతూ నగరం లో అభివృద్ధి ఎజెండా గా ముందుకు సాగుతున్నామని అన్నారు అవినీతి ప్రభుత్వం తో ప్రజలు ఇన్ని రోజులు ఎన్నో బాధలు చూశారాణి అన్నారు. నగరం లో 9 సంవత్సరాల పాలనా లో ఎంతో మంది ఇబ్బంది పడ్డారని వారి కి అండగా నిలబడుతాను అని అన్నారు. ఎక్కడి వేసిన గోంగడి అక్కడే ఉందని అన్నారు కేంద్రం లో మోదీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ఎంతో మంది లబ్ది పొందరని అన్నారు 370 ఆర్టికల్ రద్దు, త్రిబుల్ తలాక్, అయోధ్య రామ మందిర నిర్మాణం ఇలాంటి ఎన్నో ప్రజల ముందుకు తీసుకొచ్చింది అన్నారు. తెలంగాణ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఉచిత విద్య, వైద్యం పైన ప్రతేక్ష ద్రుష్టి పెడ్తామని అన్నారు. నా సేవ కార్యక్రమాల తో ప్రజల కు ఎన్నో సంవత్సరాల నుంచి అందుబాటులో ఉంటాను అని అన్నారు బీజేపీ లో ప్రతి కార్యకర్త కు అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక కార్పొరేటర్ మాస్టర్ శంకర్, అసెంబ్లీ కో కన్వీనర్ నారాయణ యాదవ్, ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి,కార్పొరేటర్ పంచారెడ్డి ప్రవళిక,మల్లేష్ యాదవ్, శ్రీనివాస్, మురళి, బీజేపీ నాయకులు డివిజన్ వాసులు పాల్గొన్నారు.