తొర్లికొండ విద్యార్థుల క్షేత్ర పర్యటన

నవ తెలంగాణ-జక్రాన్ పల్లి : మండలంలోని తొలికొండ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మంగళవారం మల్లన్న గుట్ట ప్రాంతంలో క్షేత్ర పర్యటన చేశారని ప్రధానోపాధ్యాయులు  జంగం  అశోక్ తెలిపారు. భారత తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని,బాలల దినోత్సవం జరుపుకున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్షేత్ర పర్యటన చేశారు .  గుట్ట,చెట్లు పర్యావరణానికి దోహదపడతాయని విద్యార్థులకు  వివరించారు.విద్యార్థులు ఆనందోత్సాహాలతో సంతోషంగా గడిపారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు,ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగం అశోక్, ఉపాధ్యాయులు జే సంజీవ్ కుమార్, గౌతమి,లలిత,తదితరులు పాల్గొన్నారు
Spread the love