- Advertisement -
ఇంత దొరికింది కదా అని మురువకు
అంతా పారేసుకునేదే అని మరువకు
చుట్టూ జనం ఉన్నారని మురువకు
నిజం మాట్లాడితే అంతా సర్దుకుంటారని మరువకు
ఎలా నోరు మూపించానో చూడు అని మురువకు
అలాగే జవాబొస్తుందని మరువకు
నాకే జబ్బూ లేదని మురువకు
నీకూ టైం వొస్తుందని మరువకు
నువ్వు జీవిస్తున్నప్పుడు ఎన్నో మరణిస్తుంటయని మురువకు
నువ్వు మారణిస్తున్నా ఎన్నో జీవిస్తుంటయని మరువకు
ఇక్కడ ఎంతున్నా చూడని మూర్ఖత
ఎక్కడో ఏదో ఉందని ఉరికే దీర్ఘత
అనుకున్నాం కానీ… ఆశ్చర్యం ఏమిటంటే
ఈ లోకం మిథ్య అనేవాడు క్లెవర్
అలా అని తద్భిన్నంగా సుఖిస్తున్నడు
ఇదే లోకమనేవాడు కమిటెడ్
బాధ్యతగా బతుకుతున్నడు –
ఏనుగు నరసింహారెడ్డి, 897869183
- Advertisement -


