ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు రమేష్
నవతెలంగాణ – మల్హర్ రావు
దళితులు బాంధవుడు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అని ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు రమేష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో మాట్లాడారు. మంథని నియోజకవర్గంలోని దళిత వాడల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా సీసీ రోడ్లు,సైడ్ డ్రైన్స్ నిర్మాణాల కోసం రూ.15 కోట్లు సీఆర్ఆర్ ఎస్ సి కంపోనెంట్ నిధులు మంజూరు చేయించిన రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు రమేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
దళిత గిరిజన బడుగు వర్గాల అభివృద్ధికి వారు సమాజంలో గౌరవంగా తలెత్తుకు తిరిగేందుకు మంత్రి శ్రీధర్ బాబు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారనడానికి ఇది నిదర్శనమన్నారు. దళితుల అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తున్న మంత్రికి రాబోవు ఎన్నికల్లో కూడా దళితులు కాంగ్రేస్ పార్టీ పక్షాన నిలబడతారని ఇందుకు భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల దలితుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.



