నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు వేదిక స్థాయిలో రైతు వారోత్సవాలు నిర్వహించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి శ్రీజ తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4 సోమవారం నుంచి 9 శనివారం వరకు రైతు వారం కింద వివిధ రైతు అవగాహన కార్యక్రమాలు వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా చెప్పటం జరుగుతుందన్నారు.
కొయ్యూరు రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం, వినియోగదారులు కోరుకునే సన్న వరి రకాల సాగు పై అవగాహననానో యూరియామొదలైన కార్యక్రమల గురించి రైతులకి వివరించడం జరిగిందన్నారు. రైతులకు సాయిల్ హెల్త్ కార్డ్స్ పంపిణీ చేయడం జరిగిందని, సాయిల్ హెల్త్ కార్డ్స్ యొక్క వివిధ లాభాల గురించి రైతులకు వివరించి రైతులతో నేల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తానని ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగిందన్నారు. ఆదివారం కొయ్యుర్ లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి జే. బాపూరావు,ఏఇఓ అనూష,సర్పంచులు కొండ రాజమ్మ, బొమ్మ రజిత,జంగిడి శ్రీనివాస్, బెల్లంకొండ జోత్స్న, అబ్బినవేణి లింగస్వామి, రైతులు పాల్గొన్నారు.



