నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల
వార్పిన్ కార్మికుల కూలి పెంచాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి ర్యాలీ తీసి కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ.. కార్మికుల సమస్య వెంటనే పరిష్కారం చేయాలని కలెక్టర్ ను కోరడం జరిగిందని, ఈ సమ్మె కొనసాగుతూ అనుబంధ రంగాల కార్మికుల మీద ప్రభావం పడుతుందనీ యజమానులు మొండిగా వ్యవరించకుండా కూలి పెంచాలని అన్నారు. వెయ్యి పోగులులకు రూ.38 అడుగుతే రూ.37 యజమానులు ఇస్తామని, అగ్రిమెంటుకు రమ్మని, చివరికి మళ్ళీ రూ..36 కు అగ్రిమెంట్ చేస్తామనడం యజమానుల వైఖరి సరైనది కాదని వారు పేర్కొన్నారు. ఒక్క భీముకు ఒక రూపాయి పెంచితే మూడు రూపాయలు మాత్రమే పెరుగుతుందనీ, నెలకు రూ.300 మాత్రమే పెరిగే దానికి ఇంత రాద్ధాంతం యజమానులు చేయడం సరైనది కాదనీ అన్నారు. యజమానులు వార్పిన్ కార్మికులపై కక్ష సాధింపు ధోరణి కొనసాగించకుండా సమస్య పరిష్కరించాలని అన్నారు. రూ.37 కూలి అగ్రిమెంట్ జరిగే వరకు సమ్మె కొనసాగిస్తామని అన్నారు. ధర్నాలో కార్మిక సంఘం నేతలు ముశం రమేష్,కోడం రమణ, సిరిమల్ల సత్యం,శ్రీరామ్ సదానందం, అన్నల్దాస్ గణేష్, ఉడుత రవి,మచ్చ వేణు,బుట్లవెంకటేశం, ఐరన్ ప్రవీణ్150 మంది వార్పర్లు పాల్గొన్నారు.
వార్పిన్ కార్మికుల కూలి పెంచాలని కలెక్టరేట్ ముందు ధర్నా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


