Monday, May 4, 2026
E-PAPER
Homeఖమ్మంగోల్డ్ షాప్ ఓనర్స్ తో ఎస్సై సమావేశం

గోల్డ్ షాప్ ఓనర్స్ తో ఎస్సై సమావేశం

- Advertisement -

– దొంగతనాల నివారణపై భద్రతా సూచనలు
– సీసీ కెమెరాలు, అలారం, సెక్యూరిటీ గార్డు తప్పనిసరి
నవతెలంగాణ – అశ్వారావుపేట

బంగారు దుకాణాల యజమానులతో ఎస్‌ఐ యయాతి సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పట్టణంలో బంగారు దుకాణాల్లో దొంగతనాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. క్రైమ్ డిటెక్షన్ దృష్ట్యా ప్రతి బంగారు దుకాణంలో నాణ్యమైన సీసీ కెమెరాలు, అలారం వ్యవస్థ, సెక్యూరిటీ గార్డు లేదా వాచ్‌మన్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.

దుకాణాల వద్ద రాత్రి వేళల్లో ప్రత్యేక అప్రమత్తత పాటించాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. వ్యాపారుల భద్రతతో పాటు వినియోగదారుల రక్షణ కూడా ముఖ్యమని, భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. ఈ సమావేశంలో బంగారు దుకాణాల యజమానులు రమేష్, విజయ్‌కుమార్, శ్రీనివాస్, మురళీ సాయి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -