రెండు కేసులు నమోదు : డిటిఓ జైపాల్ రెడ్డి
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలో వివిధ గ్రామాల్లో ఉన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలను డీసీఎంలను పంపించేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నామని మహబూబాద్ డిటిఓ జైపాల్ రెడ్డి, ఎం వి ఐ సాయి చరణ్, వెంకటరెడ్డి, తెలిపారు. మండల కేంద్రంలో సోమవారం వాహనాలను పరిశీలించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో తనిఖీలు చేస్తున్నామని ఇందులో భాగంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వాహనాలను పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు ఇందులో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో రెండు కేసులు నమోదు చేశామని అన్నారు. కొన్ని వాహనాలను కూడా కొనుగోలు కేంద్రాలకు తరలించామని చెప్పారు రానున్న రోజుల్లో కూడా ప్యాడి సెంటర్లకు పంపడానికి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలను తరలించేందుకు ఏర్పాటు
- Advertisement -
- Advertisement -



