నవతెలంగాణ – కామారెడ్డి
పట్టణంలోని 46, 47వ వార్డుల్లో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న, లక్ష్మినారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్పీలు బబిత, అనురాధ పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, అర్హులైన మహిళలు తప్పకుండా వచ్చి బతుకమ్మ చీరలను పొందాలని సూచించారు. చీరల స్వీకరణకు అవసరమైన పత్రాలు, డ్వాక్రా గ్రూపులో ఉన్న మహిళలు, ఆధార్ కార్డు, డ్వాక్రా గ్రూపులో లేని వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు (ఫుడ్ సెక్యూరిటీ కార్డు), ఓటరు ఐడీ కార్డు జీరాక్స్ తీసుకురావాలి. కాబట్టి 46, 47వ వార్డులకు చెందిన మహిళలు నిర్ణీత సమయంలో హాజరై బతుకమ్మ చీరలను పొందాలని కోరారు.
బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



